Mohammad Shami Injured in a Road Accident.. Suffers Head Injury

Mohammad Shami Injured in a Road Accident.. Suffers Head Injury :

  • భార్య హసీన్ జహాన్ ఆరోపణలు..
  • షమీ ఫాన్స్ ఆగ్రహం..
  • ఘోరమైన రోడ్డు ప్రమాదం..
  • తలకు తగిలిన గాయాలు..

టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.. షమీపై ఆయ‌న భార్య హసీన్ జహాన్ కొన్ని ఆరోపణలు చేయగా వాటికి తన వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పింది.. అంతేకాదు దేశానికి ద్రోహం చేయగలడు అంటూ పెద్ద పెద్ద మాటలు ఉపయోగించి షమీ ఫాన్స్ ఆగ్రహానికి ఆమె గురయింది.

Mohammad Shami Injured in a Road Accident
Mohammad Shami Injured in a Road Accident

మరో అమ్మాయితో చాటింగ్‌ చేశాడని, ఆధారాలు ఇవిగో అంటూ చాటింగ్‌ స్క్రీన్‌షాట్లను ఫేస్‌బుక్‌లో పెట్టింది. అంతేగాక తన భర్త ఏ ఒక్కరినీ వదల్లేదంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె చేస్తోన్న ఆరోపణలు నిజమై ఉండొచ్చు కానీ, కోర్టుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలా చేయడం ఏంటంటూ విమర్శలు చేస్తున్నారు.

ఘోరమైన రోడ్డు ప్రమాదం..

ఇదిలా ఉంటె తాజాగా షమీ కి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.అతను ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో షమీకి గాయాలయ్యాయి. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అతడిని డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తలకు తగిలిన గాయాలకు కుట్లు వేశారు. మరి షమీ కోలుకుంటేనే గానీ అసలేమైందో తెలీదు..

Mohammad Shami Injured in a Road Accident
Mohammad Shami Injured in a Road Accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *