బస్సులో కోడికి టికెట్ కొట్టిన కండక్టర్! || KSRTC Conductor Charged Half Tickets For Hens
బస్సులో కోడికి టికెట్ కొట్టిన కండక్టర్! || KSRTC Conductor Charged Half Tickets For Hens
బెంగళూరుకు సమీపంలోని గౌరిబిదనూరు తాలూకా ముదలోడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెండు కోళ్లను తనతో పాటు ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లారు. సదరు బస్సుకండక్టర్ శ్రీనివాస్ కు ఒక ఫుల్ టికెట్.. అతని చేతిలో ఉన్న రెండు కోళ్లకు కలిపి హాఫ్ టికెట్ ఇచ్చారు. ఇదేం న్యాయమని శ్రీనివాస్ ప్రశ్నిస్తే.. కోళ్లు.. గువ్వలు..చిలుకలు లాంటి జీవుల్ని వెంట తీసుకెళుతుంటే.. వాటికి టికెట్ తప్పనిసరి అని కర్ణాటక ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతానికైతే ఈ తరహా రూల్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదని చెప్పక తప్పదు. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ తరహా రూల్స్ తో స్ఫూర్తి చెందితే మాత్రం ప్రజలకు కొత్త తిప్పలు గ్యారెంటీ.