ఐపిఎల్ లో మరో వివాదం.. ప్రీతీ జింట నోటి దూలె కారణం..!!

నిన్న ఐపీఎల్ చివరి రెండు పోటీలు ప్రారంభమైన తరువాత, మధ్యాహ్నం జరిగిన ఢిల్లీ, ముంబై మ్యాచ్ లో ముంబై గెలిచుంటే, మరో ఆప్షన్ కు తావులేకుండా ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరుతుందని, తన జట్టు అయిన పంజాబ్ కు అవకాశాలు ఉండవన్న ఆందోళనతో ఉన్న ప్రీతి జింటా, ముంబై జట్టు ఓడిపోయిందని తెలుసుకున్న తరువాత చూపిన ఆనందం, టీవీల్లో ప్లే కాగా, దానిని తన మొబైల్ లో రికార్డు చేసిన ఓ అభిమాని సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. ప్రీతి తన పక్కనున్న వ్యక్తితో, తానిప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పడం, నవ్వుతుండటం చూసిన ముంబై అభిమానులు, ఇప్పుడామెను ట్రాల్ చేస్తూ ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆపై జరిగిన చెన్నై, కోల్ కతా మ్యాచ్ లో కనీసం 53 పరుగుల తేడాతో చెన్నైని ఓడిస్తే, పంజాబ్ జట్టుకు ప్లే ఆఫ్ గ్రూప్ లో ప్లేస్ దక్కనుండగా, ఆ మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రీతి అత్యాశ ఆ జట్టు కొంపముంచిందని కూడా నెటిజన్లు ఇప్పుడు కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *