ఎన్టీఆర్,చరణ్ లు గెస్ట్ గా భరత్ అనే నేను ఆడియో..!!

Ram Charan and Ntr guest for BharathAneNenu

‘భరత్ అనే నేను‘ ఆడియో వేడుకపై మహేశ్ బాబు అభిమానులు దృష్టి పెట్టారు. ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను భారీస్థాయిలో జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఎన్టీఆర్ ను .. చరణ్ ను మహేశ్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. 
 
 ఇక ఎన్టీఆర్ .. చరణ్ లతో కొరటాలకి కూడా ఎంతో సాన్నిహిత్యం వుంది. ఆల్రెడీ ఆయన ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ చేయగా .. త్వరలో చరణ్ తో ఓ మూవీ చేసే ఛాన్స్ వుంది. ఇక ఎన్టీఆర్ .. చరణ్ కలిసి ఓ మల్టీ స్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ ‘భరత్ అనే నేను’ ఆడియో వేడుకకి హాజరైతే, ఘట్టమనేని అభిమానులతో పాటు .. నందమూరి అభిమానులు .. మెగా ఫ్యాన్స్ కూడా ఈ స్టేజ్ ముందు చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు.
Ram Charan and Ntr guest for BharathAneNenu
Ram Charan and Ntr guest for BharathAneNenu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *